Kapileswara Puram, East Godavari Distrct 3.72

Nukalama Temple Street
Kapileswarapuram, 533309
India

About Kapileswara Puram, East Godavari Distrct

Kapileswara Puram, East Godavari Distrct Kapileswara Puram, East Godavari Distrct is a well known place listed as Tours/sightseeing in Kapileswarapuram , Tours & Sightseeing in Kapileswarapuram ,

Contact Details & Working Hours

Details

కపిలేశ్వరపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. గ్రామస్తులు ముఖ్య అవసరములకు సుమారు 10 కిలొమీటర్ల దూరంలో ఉన్న మండపేటకు వెళ్ళుదురు.ఈ గ్రామం గోదావరి నదీ తీరంలో ఉన్న ఒక పురాతన గ్రామము.

దీనిని ఆంగ్లేయుల కాలములో కపిలేశ్వరపురం జమీ అనేవారు. జామీందారీ వ్యవస్థకు చిహ్నంగా ఇప్పటికీ ఇక్కడ ఒక పెద్ద దివానం ఉంది. ఇక్కడ వరి,అరటి,కొబ్బరి, మినుము,పెసర మొదలగు పంటలు పండును.


కపిలేశ్వరపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. గ్రామస్తులు ముఖ్య అవసరములకు సుమారు 10 కిలొమీటర్ల దూరంలో ఉన్న మండపేటకు వెళ్ళుదురు.


ఈ గ్రామం గోదావరి నదీ తీరంలో ఉన్న ఒక పురాతన గ్రామము. దీనిని ఆంగ్లేయుల కాలములో కపిలేశ్వరపురం జమీ అనేవారు. జామీందారీ వ్యవస్థకు చిహ్నంగా ఇప్పటికీ ఇక్కడ ఒక పెద్ద దివానం ఉంది.ఇక్కడ వరి,అరటి,కొబ్బరి, మినుము,పెసర మొదలగు పంటలు పండును.

బలుసు పెద సర్వారాయుడు ఆంగ్లేయుల నుండి 1818లో ఈ జమీ పొందాడు. కపిలేశ్వరపురం జమీలో ఆరు శివారు లంకలున్నాయి. పెదసర్వారాయుడు మహాదాత. బ్రాహ్మణులకు, భట్టులకు భూములు, గోవులు మొదలగు పలు దానాలు చేశాడు. ఒక పెద్ద తటాకము తవ్వించాడు. 1847 లో పెద సర్వారాయుడు చనిపోగా కొడుకు బుచ్చికృష్ణయ్య పాలనకొచ్చాడు. ఇతడు 1852లో ఆరు గ్రామములు గల కేసనకుర్రు సంస్థానమును దంతులూరి బుచ్చికృష్ణరాజు నుండి కొని జమీ విస్తరించాడు.

బుచ్చికృష్ణయ్య తరువాత 1853లో వచ్చిన తమ్ముడు పట్టాబిరామయ్య బ్రాహ్మణులను, భక్తులను, పండితులను ఆదరించాడు. ఇతడు 1866లో చనిపోగా బుచ్చి సర్వారాయుడు పాలనకు వచ్చి మూడు సంవత్సరముల తరువాత హఠాత్తుగా చనిపోయాడు. భార్య రామలక్ష్మమ్మ తన పాలనలో మంచి పేరు సంపాదించింది. ఒక పెద్ద సత్రము నిర్మించింది. దత్తపుత్రుడు పట్టాభిరామయ్య 1896లో చనిపోగా ఇద్దరు మనుమలను సంరక్షించుతూ జమీ పాలించింది. 1906లో ఈమె చనిపోగా రెండవ బుచ్చి సర్వారాయుడు జమీందారయ్యాడు. ఈతడు 1913లో పెద్ద పాఠశాల నిర్మించి జిల్లా బోర్డు కు అప్పగించాడు. ఆంగ్లేయుల ఇంపీరియల్ వ్యవసాయ పరిశోధనా సంఘానికి సభ్యుడు. చాగంటి శేషయ్య గారి రాధామాధవము, ఆంధ్రకవితరంగిణి, సుగ్రీవ విజయము ముద్రింపచేశాడు. హసనాబాద్ గ్రామమును సంపాదించాడు. జిల్లా బోర్డు అధ్యక్షునిగా పని చేశాడు. 1945లో బ్రిటిష్ ప్రభుత్వము రావు బహద్దర్ బిరుదునిచ్చింది. ఇతని కొడుకు ప్రభాకర పట్టాబిరామారావు ఆంధ్ర విశ్వ విద్యాలయము సిండికేట్ సభ్యునిగా, 1952లో మదరాసు రాష్ట్ర మంత్రిగా, తిరిగి 1953లో ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా, 1958లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా మంత్రిగా సేవలందించాడు. ఇతని కాలములో సాహిత్య అకాడెమీ, సంగీత అకాడెమీ, ప్రభుత్వ వాచక పుస్తక ప్రచురణ సంస్థ ఏర్పడ్డాయి.